'పేద ప్రజలకు మేం వ్యతిరేకం కాదు' | trs mla ramalinga reddy fires on t.congress leaders | Sakshi
Sakshi News home page

'పేద ప్రజలకు మేం వ్యతిరేకం కాదు'

Aug 3 2015 4:16 PM | Updated on Sep 3 2017 6:43 AM

ఇందిరమ్మ ఇళ్ల పథకాల పేరిట కాంగ్రెస్ నాయకులు రూ.కోట్లు దోచుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకాల పేరిట కాంగ్రెస్ నాయకులు రూ.కోట్లు దోచుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పేరిట సొంత లాభం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రస్తుత టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద పట్టుబడ్డ డబ్బులు కూడా ఇందిరమ్మ ఇళ్లవేనంటూ ఆయన ఆరోపించారు. పేద ప్రజలకు తాము వ్యతిరేకం కాదని.. పేదల పక్షాన నిలబడే ప్రభుత్వమని  రామలింగారెడ్డి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement