బంగారు తెలంగాణకు పాటుపడాలి | TRS is the accumulation of many of the party | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణకు పాటుపడాలి

Apr 9 2016 1:50 AM | Updated on Aug 14 2018 10:54 AM

బంగారు తెలంగాణకు పాటుపడాలి - Sakshi

బంగారు తెలంగాణకు పాటుపడాలి

బంగారు తెలంగాణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు.....

మంత్రి రామన్న
టీఆర్‌ఎస్ పార్టీలో  పలువురి చేరిక

 
ఆదిలాబాద్ రూరల్ : బంగారు తెలంగాణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మండలంలోని మావల గ్రామ పంచాయతీ పరిధి పిట్టల్‌వాడలో సీపీఐఏంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు నారాయణ కుటుంబ సభ్యులు, పోలీసు అమరవీరుల కుటుంబాల సంఘం అధ్యక్షురాలు శివనందతోపాటు పలువురు టీఆర్‌ఎస్ పార్టీలో శుక్రవారం చేరారు. మంత్రి జోగు రామన్న పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధన కోసం సీఏం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందుకోసం ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, మండల అధ్యక్షుడు రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉష్కం రఘుపతి, జిల్లా నాయకుడు బాలూరి గోవర్థన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement