పారదర్శకంగా పోస్టింగులు: లక్ష్మారెడ్డి

Transparent postings: laxma reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విధాన పరిషత్‌ సహా మిగతా విభాగాల్లో కొత్తగా ఎంపిౖMðన అభ్య ర్థులకు పోస్టింగ్‌ల కేటా యింపుల్లో పారదర్శకత పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా పోస్టింగులు ఇవ్వాలని సూచించారు.

చరిత్రాత్మకంగా వైద్య ఆరోగ్యశాఖలో ఒకేసారి 1,133 పోస్టుల నియామకం చేపట్టగా, అందులో 919 పోస్టులు భర్తీ చేశామని, వారికి త్వరలో పోస్టింగ్‌లు కేటాయించాలని కోరారు. శనివారం వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంకా పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియలో కూడా వేగం పెంచాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఏయే స్పెషాలిటీ డాక్టర్ల అవసరం ఉందో గుర్తించి, ఆయా చోట్ల వారిని నియమించాలని ఆదేశించారు. ప్రజా వైద్యానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. కేసీఆర్‌ కిట్ల పథకంతో సర్కారీ దవాఖానాల్లో కాన్పుల సంఖ్య పెరిగినందున వాటిని దృష్టిలో పెట్టుకొని, ఎనస్థీసియా, స్త్రీ వ్యాధులు, ప్రసూతి నిపుణులను  నియమించాలన్నారు. అలాగే ఇప్పటికే ప్రకటించిన, వివిధ స్థాయిల్లో ఉన్న నియామకాల ప్రక్రియల మీద కూడా మంత్రి సమీక్షించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top