
భువనగిరి : టమాట ధర రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రైతు బజార్‌లో కిలో రూ. 56లకు విక్రయిస్తుంటే.. బహిరంగ మార్కెట్‌లో మాత్రం కిలో టమాట రూ.70 పలుకుతోంది. రైతు బజార్‌లో టమాట తక్కువ ధరకు వస్తోంది. అక్కడ వెంటనే అమ్ముడు పోవడం..తద్వారా అక్కడ టమాట లేకపోవడంతో విని యోగదారులు బహిరంగ మార్కెట్ వైపు మళ్లుతున్నారు. దీంతో రైతు బజార్‌లో ఉన్న ధర కంటే బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.8నుంచి రూ.15 వరకు అధికంగా పెంచివిక్రయిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నా గాని.. తప్పనిసరి పరిస్థితుల్లో టమాట కొనుగోలు చేయక తప్పడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.
హైదరాబాద్ నుంచి దిగుమతి..
జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలోని రైతు బజార్ ఉంది. ఇందులో 69 స్టాల్స్ ఉన్నాయి. వీటిల్లో కూరగాయలను విక్రయిస్తుంటారు. చౌక ధరలకే ఇక్కడ కూరగాయల లభ్యమవుతాయి. ఈ రైతు బజార్‌కు భువనగిరి పరిసర ప్రాంతాలైన బొమ్మలరామారం, తుర్కపల్లి, వలిగొండ, ఆత్మకూర్(ఎం) వంటి మండలాల రైతులు పండించిన కూరగాయలను ఇక్కడికే తీసుకొస్తారు. ప్రస్తుతం జిల్లాలో టమాట పంట సాగు లేకపోవడంతో ఇక్కడి వ్యాపారులు హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇదికూడా అరకొరగానే దిగుమతి కావడం.. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజురోజుకూ ధర పెరుగుతోంది. అయితే టమాట కిలో ధర గతవారం రూ.16ఉంటే ప్రస్తుతం రైతు బజార్‌లో రూ.56 ఉంది. ఇదే టమాట బహిరంగ మార్కెట్‌లో రూ.70 ధర పలకడం గమనార్హం.
ఇతర కూరగాయల ధరలు ఇలా..
ప్రస్తుతం టమాటతో పాటు ఇతర కూరగాయల ధరలు సైతం పెరుగుతున్నాయి. రైతు బజార్‌లో కిలో క్యాప్సికం రూ 44, చిక్కుడుకాయ రూ.34, ఆలుగడ్డ రూ.32, క్యారెట్ రూ.38, పచ్చిమిర్చి రూ.34, బీరకాయ రూ.30ల వరకు ఉంది. వీటి ధరలు బహిరంగ మార్కెట్‌లో రూ.5ల నుంచి రూ.8ల వరకు అ ధికంగా పెంచి విక్రయిస్తున్నారు. అయితే ని త్యం ఈ రైతు బజార్‌లో భువనగిరితోపాటు ప రిసరాల ప్రాంతాల నుంచి సుమారు 3వేల మంది వరకు వినియోగదారులు కూరగాయల ను కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. ప్ర స్తుతం కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతూ కూరగాయలను అధిక ధరలకు కొనుగోలు చేయలేకపోతున్నామని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.