12 నుంచి 21 వరకు ప్రత్యేక, బ్రేక్‌ దర్శనాలు రద్దు | Tirumala Tirupati Devastanams cancels break darshan | Sakshi
Sakshi News home page

12 నుంచి 21 వరకు ప్రత్యేక, బ్రేక్‌ దర్శనాలు రద్దు

Aug 30 2018 5:24 AM | Updated on Sep 18 2019 3:21 PM

Tirumala Tirupati Devastanams cancels break darshan - Sakshi

తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 12 నుంచి 21 వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా ప్రతి రోజూ వృద్ధులు, దివ్యాంగులు, ఏడాదిలోపు చిన్నపిల్లల తల్లిదండ్రులు, దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేశారు.  

3న గోకులాష్టమి ఆస్థానం..
శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత సెప్టెంబర్‌ 3న రాత్రి 8.00 గంటల నుంచి 10.00 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం వేడుకగా నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement