ఎన్నికల భద్రత కట్టుదిట్టం..!

Tight Security During Loksabha Elections By Police - Sakshi

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల సన్నద్ధం 

 సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు 

సాక్షి, చింతపల్లి : అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత నిర్వహించాలని పోలీస్‌ శాఖ భావిస్తోంది. ఇందుకోసం గత నెలరోజుల నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో భద్రత ఏర్పా ట్లు పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయా కేంద్రాల పరిధిలో రూట్లు సిద్ధం చేశారు. గ్రామాల్లో పోలీస్‌ కవాతు నిర్వహించి ప్రజల్లో మనోధైర్యాన్ని పెంచుతున్నారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్‌శాఖ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి సారిస్తోంది.

నియోజకవర్గంలో మొత్తం 282 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అందులో సుమారు 30కిపైగా కేంద్రాలను అధికారులు సమస్యాత్మకమైవిగా గుర్తించా రు. ఎన్నికల తేదీల నాటికి ఆయా గ్రామాల్లో పరిస్థితుల ఆధారంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. గతంలో నేర చరిత్ర కలిగిన ప్రతి ఒక్కరిని బైండోవర్‌ చేసే పనిలోపడ్డారు.

తనిఖీ కేంద్రాలు..
మద్యం, డబ్బు అక్రమ తరలింపును నిరోధించడానికి సరిహద్దు జిల్లాల పోలీసులు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు మాల్‌ వెంకటేశ్వరనగర్‌ పంప్‌హౌజ్‌ వద్ద, కొండభీమనపల్లి వద్ద, పోలేపల్లి సమీపంలో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ తనిఖీ కేంద్రాలు ఎన్నికలు పూర్తయ్యే వరకు 24 గంటల పాటు పని చేయనున్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన తర్వాతనే జిల్లాలోకి అనుమతిస్తున్నారు. 

ఓటరు చైతన్య కార్యక్రమాలు..
సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గ్రామాల్లో పోలీసులు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటర్లలో చైతన్యం నింపి శాంతియుత వాతావరణానికి సహకరించాలని కోరుతున్నారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే రూట్‌ మార్చ్‌లను సిద్ధం చేసి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. గత ఎన్నికల సమయంలో ఘర్షణలు, కవ్వింపు చర్యలు, మద్యం, డబ్బులు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులను బైండోవర్‌ చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాం తాలకు పోలీసులు వీలైనన్ని సార్లు వెళ్లి పరిస్థితులు అంచనా వేసేపనిలో పడ్డారు.

గ్రామాల్లో అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. ఎన్నికల్లో అవసరమైతే అదనపు బలగాలను ఉపయోగించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారే కాకుండా కొన్ని రిజర్వ్‌ బలగాలను కూడా అందుబాటులో ఉంచుతారు. అయితే ఎన్నికల తే దీ సమిపిస్తుండడంతో పోలీస్‌ యంత్రాంగం పరి స్థితులను బట్టి అదనపు బలగాలను అక్కడికి తరలించే వీలుంది. ఆయా గ్రామాల్లో వీడియో చిత్రీకరణ చేస్తూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top