సరిహద్దులో చెక్‌ పెడదాం | Sakshi
Sakshi News home page

సరిహద్దులో చెక్‌ పెడదాం

Published Sat, Mar 23 2019 2:47 PM

Tight Security In Border Region During Loksabha Elections - Sakshi

సాక్షి, నారాయణపేట: సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు, మద్యం తరలింపునకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో అడ్డుకట్ట వేయాలని పేట కలెక్టర్‌ ఎస్‌.వెంకట్‌రావు, కర్ణాటక రాష్ట్రం యాద్గిర్‌ కలెక్టర్‌ కూర్మారావు అన్నారు. శుక్రవారం ఇరు రాష్ట్రాల సరిహద్దు అయిన పేట శివారులోని జలాల్‌పూర్‌ స్టేజీ సమీపంలో చెక్‌పోస్టును పేట ఎస్పీ చేతన, యాద్గీర్‌ ఎస్పీ సోనియావనే రిషికేశ్‌ భగవాన్‌లతో కలిసి పరిశీలించారు.

అనంతరం జలాల్‌పూర్‌ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇరు రాష్ట్రాల అధికారుల తో నిర్వహించిన కోఆర్డినేషన్‌ సమావేశంలో కలెక్టర్లు మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు.

తెలంగాణ నుంచి వెళ్లి, వచ్చే వాహనాలను ఈ ప్రాంత పోలీసులు పరిశీలించి వాటిని రిజిష్ట్రర్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే కర్ణాటక నుంచి వచ్చి వెళ్లే వాహనాలను ఆ రాష్ట్ర పోలీసులు రికార్డు చేయాలన్నా రు. ఏదైనా అనుమానాలు వస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. విధుల్లో ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు.

ఏప్రిల్‌ 11 న ఎన్నికలు ముగిసినా 23 వరకు చెక్‌పోస్టును కొనసాగించాలని ఆదేశించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇరు రాష్ట్రాల పోలీ సులు అధికారులు, సిబ్బంది సహకరించుకోవాలని కోరారు. సమావేశంలో పేట సీఐ సంపత్‌కుమార్, ఎక్సైజ్‌ సీఐ నాగేందర్, ఎంపీడీఓ వెంకటయ్య, ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. 
     

Advertisement
Advertisement