రెండో టెస్టుకు 1500 మందితో భారీ భద్రత

Tight Security With 1500 Police Men To Second Test Match Between India And Westindies - Sakshi

హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 12న భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య జరగబోయే రెండో టెస్టుకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. విలేకరులతో మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ..ఈ 1500 మంది పోలీసులతో పాటుగా స్టేడియం మేన్‌జ్‌మెంట్‌ కూడా ప్రత్యేకంగా ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. 100 సీసీ టీవీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశామని తెలిపారు. రెండో టెస్టుకు హాజరయ్యే ప్రేక్షకులు  భద్రత అధికారుల సూచనలు పాటిస్తూ సెల్‌ఫోన్‌ తీసుకెళ్లవచ్చునని తెలిపారు.

లాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్‌బ్యాంక్‌లు, ఎలక్ట్రానిక్‌ ఐటమ్స్‌, కాయిన్స్‌, లైటర్స్‌, హెల్మెట్స్‌, ఫెర్ప్యూమ్స్‌, బ్యాగ్స్‌, వాటర్‌ బాటిల్స్‌, బయటి తినుబండారాలకు అనుమతి లేదని వివరించారు. ఫోర్‌ వీలర్‌ వాహనాలకు 16 చోట్ల పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశామని, 4900 వరకు బైక్‌లను పార్కింగ్‌ చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top