
ఇంద్రావత్ అఖిల్
సాక్షి, హైదరాబాద్ : చింత చెట్టుకు ఊయల కట్టుకుని ఊగుతున్న బాలుడిపై పిడుగు పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కర్మాన్ ఘాట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం సమీపంలోని అంజిరెడ్డి నగర్‌కు చెందిన ఇంద్రావత్ అఖిల్ అనే బాలుడు చింతచెట్టుకు ఉయల కట్టుకుని ఊగుతున్నాడు. సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో అతనిపై పిడుగు పడటంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు. దీంతో బాలుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.