ముగ్గురు అన్నదాతల ఆత్మహత్య | three formers suicide | Sakshi
Sakshi News home page

ముగ్గురు అన్నదాతల ఆత్మహత్య

May 15 2015 12:13 AM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధతో వేర్వేరు చోట్ల ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు..

సాక్షి, నెట్‌వర్క్: అప్పుల బాధతో వేర్వేరు చోట్ల ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం  జ్యోతినగర్‌కు చెందిన గిద్దె అబ్రహాం(65), మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన ఎలికట్ట జంగయ్య(35) గురువారం ఉరేసుకున్నారు. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మం డలం చిల్వకోడూర్‌కు చెందిన తొట్ల రాజయ్య(60) క్రిమిసంహారక మందు తాగాడు.  

విద్యుదాఘాతంతో..

నందిపేట: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని కుద్వాన్‌పూర్‌కి చెందిన గుండు పోతన్న (62) కరెంటు కాటుకు బలయ్యాడు.  చేనులోని బావి వద్ద  మోటారుకు చెందిన సర్వీస్ వైరు కిం దపడిపోయింది. దానిని పక్కకు తొలగిస్తుండగా పోతన్న విద్యుదాఘాతానికి గురయ్యూడు.

 పిడుగుపాటుతో మరొకరు మృతి

 గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ముత్నూర్‌కు చెందిన ఎం.కేశవ్(29) ధామన్‌గూడ శివారులోని తన చేను వద్దకు గురువారం వెళ్లాడు. సాయంత్రం వర్షం వస్తుం డగా పక్కనే ఉన్న మామిడి చెట్టు కిందికి వెళ్లగా పిడుగుపడి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement