ఖమ్మంలో సిని నటుడు వేణు విస్తృత ప్రచారం | Thottempudi Venu Canvass In Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో సిని నటుడు వేణు విస్తృత ప్రచారం

Dec 1 2018 11:52 AM | Updated on Dec 1 2018 11:52 AM

Thottempudi Venu Canvass In Khammam - Sakshi

ప్రచారం చేస్తున్న నటుడు వేణు

సాక్షి, ఖమ్మంఅర్బన్‌: ప్రజాకూటమి ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ సినీ నటుడు తొట్టెంపూడి వేణు శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంటిం టి ప్రచారం నిర్వహించారు. సైకిల్‌ గుర్తుకు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. 
మేలు చేసేవారికి అవకాశం కల్పించాలి ..
ఖమ్మంమామిళ్లగూడెం: ప్రజలకు మేలు చేసేవారికి ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజాస్వామ్య కమ్మ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ధనాల కొండయ్యచౌదరి కోరారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ట్రస్టు ద్వారా 5 దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు నీళ్లు అందించి గతంలో ఎంపీగా పనిచేసి అభివృద్ధికి చేసిన ప్రజాకూటమి ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కుటుంబ పార్టీకి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పరిటాల లింగరాజుయాదవ్, కె.కృష్ణమూర్తి, పాటి శ్రీనివాస్‌చౌదరి, కొమ్మినేని వంశీ, పతాని సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement