చంచల్‌గూడలో మహిళా పెట్రోల్‌ బంక్‌ | Sakshi
Sakshi News home page

చంచల్‌గూడలో మహిళా పెట్రోల్‌ బంక్‌

Published Sun, Jun 11 2017 2:24 AM

చంచల్‌గూడలో మహిళా పెట్రోల్‌ బంక్‌ - Sakshi

ప్రారంభించేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ ఏర్పాట్లు
హైదరాబాద్‌: దేశంలోనే మొదటిసారిగా మహిళా ఖైదీలతో నిర్వహించే పెట్రోల్‌ బంక్‌ను చంచల్‌గూడలో ప్రారంభించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఖైదీల సంస్కరణల్లో భాగంగా చంచల్‌గూడ మహిళా జైలులో శిక్ష అనుభవించి విడుదలైన 30 మంది మహిళలకు ఈ బంక్‌లో జీవనోపాధి కల్పించనున్నారు. వీరికి నెలకు రూ.12 వేల వేతనం ఇవ్వనున్నారు. మరో 20 రోజుల్లో ఈ బంక్‌ వినియోగంలోకి రానుంది. ఖైదీలకు ఉపాధి కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఈ పెట్రోల్‌ బంక్‌ నెలకొల్పుతున్నామని మహిళా జైలు సూపరింటెండెంట్‌ బషీరాబేగం పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement