తాళం వేసిన ఇంట్లో చోరీ

Thieves Steal Gold In Locked House In Nalgonda - Sakshi

సాక్షి, నల్గొండ : గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలోని బెట్టెగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండ అచ్చయ్య తనకున్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే వ్యవసాయ పనుల నిమిత్తం ఇంటికి తాళంవేసి పొలానికి వెళ్లారు. తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు యజమానికి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి పరిశీలించగా బీరువాలో ఉన్న రూ. 3వేలు తులంన్నర బంగారు మాటీలు, చెవి దిద్దులు కనిపించకపోవడంతో  పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా క్లూస్‌టీంను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు. బాధితుడు కొండ అచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.   

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top