ఫ(వే)స్ట్ ఎయిడ్ బాక్సులు.. | The quality of buses drought | Sakshi
Sakshi News home page

ఫ(వే)స్ట్ ఎయిడ్ బాక్సులు..

Oct 12 2014 3:36 AM | Updated on Sep 2 2017 2:41 PM

ఫ(వే)స్ట్ ఎయిడ్ బాక్సులు..

ఫ(వే)స్ట్ ఎయిడ్ బాక్సులు..

ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడంలో అతిపెద్ద రవాణాసంస్థగా గిన్నిస్‌బుక్‌లోనూ గుర్తింపు పొందిన మన ఆర్టీసీ ప్రస్తుతం ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదనడానికి సాక్ష్యాలివి...

‘అనగనగా నేనొక ‘పల్లె వెలుగు’ను.. అదేనండి ఆర్టీసీ బస్సును.. ఎన్నిరిపేర్లొచ్చినా.. ఇంజిన్ బాగాలేకున్నా.. కిందామీడా పడి.. నానా తిప్పలతోప్రయాణికులను గమ్యానికి చేరుస్తుంటాను.. కాని ఈ మధ్య ప్రమాదాలు జరిగితే.. బస్సుల్లో ఫస్ట్‌ఎయిడ్ బాక్సుల్లేవని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.. వెంటనే ఆ బాక్స్‌లను ఏర్పాటు చేసి నన్ను ప్రయాణికులు తిట్టకుండా ఆపండి’ అంటూ ఓ బస్సు ఇలా మొరపెట్టుకుంటోంది.        - నిజామాబాద్ నాగారం
 
- ప్రమాదాలు జరిగితే ప్రథమ చికిత్స లేనట్టే..
- పట్టని ఆర్టీసీ అధికారులు
- బస్సుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు కరువు

ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడంలో అతిపెద్ద రవాణాసంస్థగా గిన్నిస్‌బుక్‌లోనూ గుర్తింపు పొందిన మన ఆర్టీసీ ప్ర స్తుతం ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదనడానికి సాక్ష్యాలివి.. ముఖ్యంగా ప్రమాదాలు జరిగితే చిన్నపాటి గాయాలకు ప్రథమ చికిత్స చేసేందుకు కూడా బస్సుల్లో అవకాశం ఉండడం లేదు. దీంతో చిన్నగాయాలు కాస్తా ఆస్పత్రికి వచ్చేసరికి పెద్ద గాయాలవుతున్నాయి.

ఇలా పల్లె వెలుగు నుంచి సూపర్ లగ్జరీ బస్సుల వరకు ఏ బస్సుల్లో కూడా ఫస్ట్‌ఎయిడ్ కిట్స్ ఉండడం లేదు. నిజామాబాద్ రీజియ న్ పరిధిలో 6 డిపోలు ఉన్నాయి.  రీజియన్ మొత్తంలో 680 ఆర్టీసీ బస్సులున్నాయి. ఇందు లో పల్లెవెలుగు-368, ఎక్స్‌ప్రెస్-228, డీలక్స్-31, సూపర్‌లగ్జరీ-34, గరుడ-06, ఇంద్ర- 13 బస్సులు ఉన్నాయి. ఇవీ కాక ప్రేవేటు బ స్సులు సైతం ఉన్నాయి. అయితే సగానికిపైనే బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్‌బాక్సులు లేవు. బాక్సులున్నా అవి ఖాళీగానే కనిపిస్తున్నాయి.
 
నిబంధనలివి..
ఆర్టీసీ డిపో మేనేజర్లు వారి పరిధిలో ఉన్న బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. బాక్సుల్లో ప్రథమ చికిత్స కిట్లు ఉన్నాయో లేదో పరీశీలించాలి. లేకుంటే వాటి ని పెట్టేంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రై వేటు బస్సుల్లో లేకుంటే చర్యలు తీసుకోవాలి.  - త్వరలో ఏర్పాటు చేయిస్తాం

బస్సుల్లో ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు లేని మాట వాస్తవామే. అవి పాడైపోయినవి. వీటి బాధ్యత మొత్తం ఆయా డిపో మేనేజర్లదే ఉం టుంది. ఎవరైనా దాతలు ముందుకొస్తే కొత్త బాక్సులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం.- గంగాధర్, డిప్యూటీ సీటీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement