బావిలోపడి తండ్రీ కొడుకులు మృతి | The father and son lying dead in a well | Sakshi
Sakshi News home page

బావిలోపడి తండ్రీ కొడుకులు మృతి

Apr 3 2016 12:31 PM | Updated on Aug 29 2018 4:18 PM

ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన కొడుకును కాపాడటానికి వెళ్లిన తండ్రి కూడా నీట మునిగి మృతిచెందాడు.

ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన కొడుకును కాపాడటానికి వెళ్లిన తండ్రి కూడా నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జానిపాష కొడుకుతో కలిసి గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన కుమారుడు(10) ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. కొడుకును కాపాడుకోవడానికి యత్నించిన జానిపాష కూడా నీట మునిగి మృతిచెందాడు. తండ్రీ కొడుకుల మృతితో గ్రామంలో విశాద ఛాయలు అలుముకున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement