విద్యుదాఘాతానికి రైతు బలి | The farmer killed in electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి రైతు బలి

Feb 1 2016 1:17 PM | Updated on Oct 1 2018 4:01 PM

విద్యుదాఘాతానికి రైతు బలి - Sakshi

విద్యుదాఘాతానికి రైతు బలి

పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై ఫీజు మర్చడానికి వెళ్లిన రైతు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు.

పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై ఫీజు మర్చడానికి వెళ్లిన రైతు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా జనగామ మండలం షామీర్‌పేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొజ్జుల మల్లేశం(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో ఈ రోజు పొలం వద్దకు వెళ్లిన అతను ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మృతదేహంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. అప్పల బాధతోటే విద్యుత్ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య నిర్మల ఆరోపిస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement