హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం | The failure of State government in the implementation of guarantees | Sakshi
Sakshi News home page

హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

Jun 2 2016 2:47 AM | Updated on Nov 9 2018 5:56 PM

హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం - Sakshi

హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్....

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్

గొల్లపల్లి : రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ అన్నారు. గొల్లపల్లిలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి దశ, దిశ లేదన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉంటే.. ఎవరి కోసం ఈ సంబరాలు చేస్తున్నారని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో పోతుందన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దళితులకు మూడెకరాల పంపిణీ, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, కేజీ టు పీజీ విద్య అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement