విధులను బహిష్కరించిన మున్సిపల్ సిబ్బంది | The expulsion of the functions of municipal staff | Sakshi
Sakshi News home page

విధులను బహిష్కరించిన మున్సిపల్ సిబ్బంది

Jun 4 2015 12:23 PM | Updated on Oct 16 2018 6:27 PM

బిల్ కలెక్టర్‌పై జరిగిన దాడికి నిరసనగా గురువారం మెదక్ జిల్లా సంగారెడ్డి మున్సిపల్ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు.

మెదక్: బిల్ కలెక్టర్‌పై జరిగిన దాడికి నిరసనగా గురువారం మెదక్ జిల్లా సంగారెడ్డి మున్సిపల్ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. మున్సిపాలిటీ పరిధిలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ముఖ్తార్‌పై టీఆర్‌ఎస్ నాయకుడు జీవీ శ్రీనివాస్ బుధవారం దాడికి పాల్పడ్డారు. దీనికి నిరసనగా గురువారం విధులను బహిష్కరించిన సిబ్బంది అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement