గుర్తింపు సప్పుడు లేదు | The election process, from the production | Sakshi
Sakshi News home page

గుర్తింపు సప్పుడు లేదు

Published Sat, May 21 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలుపొందిన టీబీజీకేఎస్ నాలుగేళ్ల కాలపరిమితి జూన్ 28తో ముగియనున్నది.

జూన్ 28తో ముగియనున్న  టీబీజీకేఎస్ కాలపరిమితి
మొదలుకాని సింగరేణి ఎన్నికల ప్రక్రియ
సీఎల్‌సీకి లేఖ రాయని యాజమాన్యం
ఒత్తిడి తెస్తున్న కార్మిక సంఘాలు

 

సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలుపొందిన టీబీజీకేఎస్ నాలుగేళ్ల కాలపరిమితి జూన్ 28తో ముగియనున్నది. గడువు ఇంకా ఐదు వారాలు మాత్రమే ఉంది. అరుునా ఇప్పటి వరకు యూజమాన్యం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ముందస్తు పనులు చేపట్టలేదు. కార్మిక సంఘాలు మాత్రం రెండు నెలల క్రితం నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టి గనులను చుట్టి వస్తున్నాయి.    - గోదావరిఖని(కరీంనగర్)

 

సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను సెం ట్రల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉం టుంది. ఇందుకు రెండు మూడు నెలల ముందు నుంచే ప్రక్రియ ప్రారంభించాలి. దీనికంటే ముందు యాజమాన్యం ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లేబర్ కమిషనర్(సీఎల్‌సీ) కి లేఖ రాయాలి. ఆ తర్వాత సీఎల్‌సీ నుంచి హైదరాబాద్‌లోని రీజినల్ లేబర్ కమిషనర్(సెంట్రల్)కు ఓ ప్రత్యే క అధికారిని నియమిస్తూ ఆదేశాలిస్తారు. ఆయన పర్యవేక్షణలో ఆర్‌ఎల్‌సీ కార్యాలయానికి చెందిన కార్మిక శాఖ అధికారులు సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల్లో పర్యటించి గనులు, కార్మికుల సంఖ్య, పోలింగ్ జరిగే ప్రాంతాలు తదితర వివరాలను సేకరిస్తారు. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మూడు నెలల ముందు నుంచే ప్రారంభమవుతుంది. అరుుతే ఇప్పటి వరకు యాజమాన్యం ఢిల్లీలోని సీఎల్‌సీకి ఎన్నికలను నిర్వహించాలని లేఖ రాయలేదు. హైదరాబాద్‌లోని ఆర్‌ఎల్‌సీ అధికారులు సైతం ఎన్నికల విషయమై పెద్దగా పట్టించుకోవడం లేదని స్పష్టమవుతున్నది.

 
గడువు ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి

సింగరేణిలో ప్రస్తుతం 11 ఏరియూలున్నాయ. గత ఎన్నికల్లో ఐదు ఏరియూలు గెలిచిన టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా.. రెండేసి ఏరియూలు గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్ ప్రాతినిధ్య సంఘాలుగా వ్యవహరిస్తున్నాయి. 2012 జూన్ 28న నిర్వహించిన ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్‌కు ఆగస్టు 6న యాజమాన్యం అధికారికంగా లేఖ అందజేసింది. దీనిని బట్టి ఆగస్టు 6వ తేదీ వరకు టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా కొనసాగే అవకాశం ఉందని ఆ సంఘం నాయకులు పేర్కొంటున్నారు. ఎన్నికలు జరిగిన జూన్ 28 తోనే కాలపరిమితి పూర్తవుతుందని, దీని ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రాతినిధ్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఏఐటీయూసీ నాయకత్వం ఢిల్లీలోని సీఎల్‌సీ కార్యాలయానికి లేఖ రాసింది. త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కంపెనీపై ఒత్తిడి తీసుకువస్తున్నది. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సీఎల్‌సీకి సైతం నాయకులు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement