కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది.
పాల్వంచ రూరల్: కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం చండ్రాలగూడెం పంచాయతీకి చెందిన గృహిణి కల్తీ నాగమణి (27) నాలుగు రోజుల క్రితం వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
తీవ్ర కాలిన గాయాలతో ఉన్న ఆమెను చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమె ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది.