నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి | The death of a baby lying in a bucket of water | Sakshi
Sakshi News home page

నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి

Sep 12 2014 2:39 AM | Updated on Apr 3 2019 7:53 PM

నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి - Sakshi

నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి

బుడిబుడి అడుగులతో..బోసినవ్వులతో ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ నీటి బకెట్‌లో పడి మృతిచెందిన సంఘటన మేడిపల్లి మండలం భీమారంలో గురువారంచోటుచేసుకుంది.

భీమారంలో  విషాదం
భీమారం(మేడిపెల్లి) : బుడిబుడి అడుగులతో..బోసినవ్వులతో ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ నీటి బకెట్‌లో పడి మృతిచెందిన  సంఘటన మేడిపల్లి మండలం భీమారంలో గురువారంచోటుచేసుకుంది. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన లెసైట్టి మహేశ్-రమ దంపతులకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.మహేశ్ భార్య రమ మధ్యాహ్నం ఇంటి ఆవరణలో బట్ట లు ఉతుకుతుండగా చిన్నకూతురు దివ్యంశీ అలియాస్ మిని (20నెలలు)  అక్కడే ఆడుకుంటోంది.

చిన్నారి ఆటను చూస్తూనే రమ ఉతికిన బట్టలను బం గ్లాపై ఆరేసేందుకు వెళ్లింది. కిందికి వచ్చి చూసేసరికి కూతురు నీటి బకెట్‌లో పడి ఉంది. ఆందోళనతో అరవగా కుటుంబ సభ్యులు వచ్చి పాపను బకెట్‌లో నుంచి బయటకు తీసి ప్రథమచికిత్స చేశారు. అనంతరం జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో వారి రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన స్థానికులను  కలచివేసింది. సాయంత్రం జరిగిన చిన్నారి అంత్యక్రియలకు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. చిన్నా తండ్రి మహేశ్ భీమారం సింగిల్ విండో వైస్‌చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement