
జైలుకెళ్తానేమోనని..!
మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయంతో ఓ వ్యక్తి న్యాయమూర్తి
సంగారెడ్డి క్రైం: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయంతో ఓ వ్యక్తి న్యాయమూర్తి ఎదుటే గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి కోర్టులో గురువారం చోటు చేసుకుంది. వివరాలు... రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దుటూరుకు చెందిన వై సురేందర్‌రెడ్డి(43) వ్యాపార రీత్యా భార్యాపిల్లలతో చందానగర్‌లో ఉంటున్నాడు.
ఈ నెల 12న సురేందర్‌రెడ్డి మద్యం తాగి వాహనం నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు రామచంద్రాపురంలో పట్టుకున్నారు. ఆయనను సంగారెడ్డిలోని ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ప్రభాకర్ ఎదుట ట్రాఫిక్ పోలీసులు హాజరుపర్చారు. తనను జైలుకు పంపుతారేమోనని మానసిక ఆందోళనకు గురైన సురేందర్‌రెడ్డి న్యాయమూర్తి సమక్షంలో కోర్టులోనే కుప్పకూలాడు.