నేటి అర్ధరాత్రి నుంచి క్యాబ్స్ సమ్మె | The cabs on strike from midnight | Sakshi
Sakshi News home page

నేటి అర్ధరాత్రి నుంచి క్యాబ్స్ సమ్మె

May 20 2014 3:18 AM | Updated on Sep 2 2017 7:34 AM

నేటి అర్ధరాత్రి నుంచి క్యాబ్స్ సమ్మె

నేటి అర్ధరాత్రి నుంచి క్యాబ్స్ సమ్మె

ఐటీ ఉద్యోగుల రవాణా కోసం పనిచేస్తున్న క్యాబ్స్ రేట్లు పెంచాలని, సబ్ వెండర్స్ వ్యవస్థను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లతో మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె....

బషీర్‌బాగ్, న్యూస్‌లైన్: ఐటీ ఉద్యోగుల రవాణా కోసం పనిచేస్తున్న క్యాబ్స్ రేట్లు పెంచాలని, సబ్ వెండర్స్ వ్యవస్థను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లతో మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్టు తెలంగాణ క్యాబ్స్ యజమానులు-డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.సంతోషర్‌రెడ్డి, గ్రేటర్ విభాగం అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు.

సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో వారు మాట్లాడారు. డీజిల్ రేట్లు, వాహనాల నిర్వహణ వ్యయం పెరిగినందున క్యాబ్స్ రవాణ  రేట్లు పెంచాలన్నారు. ప్రమాదాలు జరిగితే అయా కంపెనీలే బాధ్యత వ హించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు సబ్బీర్ అహ్మద్, టీఆర్‌ఎస్‌కేవీ అధ్యక్షుడు టి.సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement