పదిలో మెరుగు | Tenth class results 6th place this year in nalgonda district | Sakshi
Sakshi News home page

పదిలో మెరుగు

May 16 2014 3:33 AM | Updated on Sep 6 2018 3:01 PM

పదో తరగతి పరీక్ష ఫలితాలు జిల్లాను ఒకింత ముందు వరుసలోకి చేర్చాయి. గత ఏడాది 12వ స్థానానికి పరిమితమైన జిల్లా ఈసారి 6వ స్థానానికి ఎగబాకింది. తెలంగాణ జిల్లాల్లో 3వ స్థానాన్ని చేజిక్కించుకుంది.

నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్ష ఫలితాలు జిల్లాను ఒకింత ముందు వరుసలోకి చేర్చాయి. గత ఏడాది 12వ స్థానానికి పరిమితమైన జిల్లా ఈసారి 6వ స్థానానికి ఎగబాకింది. తెలంగాణ జిల్లాల్లో 3వ స్థానాన్ని చేజిక్కించుకుంది.
 
 జిల్లావ్యాప్తంగా 48,426 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 45,112మంది (93.16శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 23,427 మందికిగాను 22024 మంది (94.01శాతం) పాస్ కాగా బాలురు 24,999 మందికిగాను 23088 (92.36శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈసారి జిల్లాలో రికార్డుస్థాయిలో 102 మంది విద్యార్థులు 10 గ్రేడ్ పాయింట్ అవరేజ్ (జీపీఏ) సాధించారు. వీరిలో అత్యధికులు తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులే.
 
 మెరుగైన ఫలితాలు సాధించారు
 పదో తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఈ సారి మెరుగైన ఫలితాలు సాధించారు. రాష్ట్రంలో 6వ స్థానం, తెలంగాణలో 3వ స్థానం దక్కించుకున్నాం. ఇవి ప్రామాణికమైన ఫలితాలుగా భావిస్తున్నాం. భవిష్యత్తులో అగ్రస్థానంలో నిలబడేందుకు ప్రయత్నిస్తాం.
 - ఎస్.విశ్వనాథరావు, డీఈఓ నల్లగొండ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement