రిజర్వేషన్లపై టెన్షన్‌

Tension On Reservation - Sakshi

నేడో, రేపో ప్రకటించే అవకాశం

2011 జనాభా లెక్కల ప్రకారం అమలునేడో, రేపో ప్రకటించే అవకాశం

2011 జనాభా లెక్కల ప్రకారం అమలు

జిల్లాలో గ్రామ పంచాయతీలు  468  
వార్డులు  4,750  
మొత్తం ఓటర్లు  7,25,660 
మహిళలు  3,61,914  
పురుషులు  3,63,746  

సాక్షి, జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌) :  పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లౖòపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ గ్రామ పంచాయతీకి ఏ రిజర్వేషన్‌ కానుందోననే సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వ ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 721 గ్రామ పంచాయతీల్లో 719 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయావర్గాల నేతలు తాము పోటీ చేయదల్చుకున్న స్థానాలకు రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

అధికారుల గుర్తింపు పూర్తి  
జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో పాల్గొనే అధికారుల గుర్తింపు ఇప్పటికే పూర్తయ్యింది. జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ ఆఫీసర్లు(పీఓ)లు 1439 మందిని గుర్తించారు. ఇందులో మహబూబ్‌నగర్‌ డివిజన్‌లో 691, నారాయణపేట్‌లో 148 మందిని ఎంపిక చేశారు. ఏపీఓలు 2,271 మందిని గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా మండలాల్లో ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు కేత్రస్థాయి పరిశీలన చేశారు. జిల్లా వ్యాప్తంగా 6,366 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గుర్తించారు. ప్రతి వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఎన్నికల నిబంధన మేరకు పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.  

రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు  
జిల్లాలోని గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ ఎప్పుడెప్పుడా అని రాజకీయ పార్టీలు, ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ఆరంభమైన తరువాత ఒక్కసారిగా పల్లె వాతావరణం వేడెక్కనుంది. ఆగస్టు 2, 2013న కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. అంతలోపు ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు, 4,750 వార్డులు ఉన్నాయి. మొత్తం 7,25,660మం ది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,61,914  మహిళ ఓటర్లు, 3,63,746 పురుష ఓటర్లు ఉన్నారు.  

2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు  
జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. దీనిప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లను అమలు చేయనుండగా, బీసీలకు ఓటర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ల అమలుచేస్తారు. దీంతోపాటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు ఉంటుంది. అన్ని కేటగిరీల్లోనూ 50శాతం పదవులు మహిళలకు కేటాయించనున్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం బీసీలకు 34శాతం, జనాభా ఆధారంగా ఎస్సీలకు 20.46 శాతం సర్పంచ్‌ పదవులను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో ఎస్టీ జనాభా 5.73శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించే అవకాశాలు ఉన్నాయి.    

ఓటర్ల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు  
బీసీలకే కేటాయించే రిజర్వేషన్లను వారి ఓటర్ల సంఖ్య ఆధారంగా కేటాయించనున్నారు. జిల్లాలో 4,61,542 బీసీ ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,30,319 పురుష, 2, 31,223మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 34శాతం మేరకు సర్పంచ్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించనున్నారు. దీని ప్రకారం జిల్లాలో బీసీలకు 243 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. అలాగే ఎస్టీలకు 5.73శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. దీంతో తండాలను కలుపుకుని 148 స్థానాలు సర్పంచ్‌ స్థానాలు దక్కనున్నాయి. ఎస్సీలకు 20.46 శాతం రిజర్వేషన్లను ఎస్సీలకు కేటాయిస్తారు. మొత్తం 714 స్థానాల్లో ఎస్సీలకు 146 స్థానాలు దక్కనున్నాయి. జనరల్‌కు వివిధ వర్గాలకు 60శాతం మేరకు రిజర్వేషన్ల కేటాయించే అవకాశాలు ఉన్నాయి.   

జిల్లాలో 6,366 వార్డులు  
జిల్లా వ్యాప్తంగా 721 గ్రామ పంచాయతీలు, 6366 వార్డులు ఉన్నాయి. ఇందులో 34 శాతం లెక్కన బీసీలకు 2,164 స్థానాలు రానున్నాయి. వాటిలో 1,082 మహిళలకు, 1,082 బీసీ జనరల్‌ స్థానాలకు కేటాయించే అవకాశాలున్నాయి. ఎస్సీలకు 20.46శాతం లెక్కన 1,302 స్థానాలు దక్కనున్నాయి. వాటిలో 651 మహిళలకు, మిగతావి ఎస్సీ జనరల్‌కు దక్కే అవకాశాలున్నాయి. అలాగే ఎస్టీలకు 5.73శాతం మేరకు 365 స్థానాలు దక్కనుండగా, వాటిలో 182 మహిళలకు, 183 ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్లు పోగా 2,535 స్థానాలు జనరల్‌కు దక్కనున్నాయి. వాటిలో జనరల్‌ మహిళలకు 1,267 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది.  

మార్గదర్శకాలు రావాల్సి ఉంది  
ప్రభుత్వం నుంచి తమకు పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు అందాల్సి ఉంది. గత ఎన్నికల్లో నిర్వహించిన మాదిరిగానే రిజర్వేషన్లు కేటాయించాలని సూచనప్రాయంగా తెలిపారు. అందులో అంతగా స్పష్టత లేదు. మరో 4, 5 రోజుల్లో పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.            – వెంకటేశ్వర్లు, డీపీఓ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top