జేఈఈ మెయిన్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు

Telugu Students is the toppers in JEE Mains - Sakshi

దేశ వ్యాప్తంగా 15 మందికే 100 పర్సెంటైల్‌

అందులో ఐదుగురు తెలుగు విద్యార్థులే

తెలంగాణ నుంచి నలుగురు, ఏపీ నుంచి ఒకరు

ఏప్రిల్‌ 6–20 మధ్య మరోసారి జేఈఈ మెయిన్‌

ఫిబ్రవరి 8 నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఇతర జాతీయస్థాయి విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్, బీఆర్క్‌లో ప్రవేశాలకోసం నిర్వహించిన ‘జేఈఈ మెయిన్‌–2019’ప్రవేశ పరీక్షలో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా తెలుగు విద్యార్థులు అత్యధిక స్కోర్‌ సాధించారు. దేశ వ్యాప్తంగా 15 మంది మాత్రమే 100 పర్సెం టైల్‌ సాధించగా.. అందులో ఐదుగురు తెలుగు విద్యార్థులే కావడం విశేషం. ఇందులో తెలంగాణ విద్యార్థులు నలుగురు ఉండగా, ఒకరు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి. 100 పర్సెంటైల్‌ సాధిం చిన వారిలో తెలంగాణకు చెందిన ఆదెల్లి సాయికిరణ్‌ జాతీయస్థాయిలో మూడో స్థానంలో, ఇందుకూరి జయంత్‌ ఫణిసాయి ఏడో స్థానంలో, విశ్వనాథ్‌ కె 8వ స్థానంలో, బట్టెపాటి కార్తికేయ 12వ స్థానంలో నిలిచారు. ఏపీ విద్యార్థి బొజ్జా చేతన్‌రెడ్డి నాలుగో స్థానంలో నిలిచాడు.

ఈనెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 8 షిఫ్ట్‌లలో.. ఆన్‌లైన్లో దేశ వ్యాప్తంగా 254 పట్టణాల్లోని 467 పరీక్ష కేం ద్రాల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్షలను నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ పరీక్షను నిర్వహించడం ఇదే తొలి సారి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9,29,198 మంది దరఖాస్తు చేసుకోగా, అం దులో 8,74,469 మంది విద్యార్థులు పరీక్షలకు హాజ రయ్యారు. విద్యార్థులు సాధించిన మార్కులు, ఆ షిప్ట్‌లో పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య, మొత్తం విద్యార్థుల సంఖ్యతో నార్మ లైజ్‌ చేసి, వారి పర్సెంటైల్‌ స్కోర్‌ను ఎన్‌టీఏ ప్రకటించింది. వాస్తవానికి ఈనెల 31న ఫలి తాలను వెల్లడిస్తా మని ఎన్‌టీఏ గతంలోనే పేర్కొన్నప్పటికీ.. రికార్డు స్థాయిలో ముందు గానే ఫలితాలను వెల్లడించడం విశేషం. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కి టెక్చర్‌లో (బీ–ఆర్క్‌) ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌–2 ఫలితాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్‌టీఏ వెల్లడించింది.

తెలుగు వారే అత్యధికం!
ఈ పరీక్షలో 99.99 పర్సెంటైల్‌ సాధించిన విద్యార్థులు 600–700 మంది విద్యార్థులే ఉండే అవకాశం ఉంది. మరోవైపు 99.95– 99.99 పర్సెంటైల్‌ వచ్చిన వారికే టాప్‌ 100 లోపు ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అందులో తెలంగాణ విద్యార్థులు 30–40 మంది వరకు ఉండే అవకాశం ఉందని జేఈఈ నిపుణుడు ఉమాశంకర్‌ తెలిపారు. 90కి పైగా పర్సెంటైల్‌ సాధించిన వారిలో దాదాపు 3వేల మంది వరకు తెలుగు విద్యార్థులే ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. పర్సెంటైల్‌ విషయంలో విద్యార్థుల్లో కొద్దిగా గందరగోళం ఉందని, ఫైనల్‌ కీ విడుదల చేయడంతోపాటు, విద్యార్థులు ఓఎంఆర్‌ రెస్పాన్స్‌ షీట్లను వెబ్‌సైట్‌ నుంచి తొలగించకుండా అలాగే ఉంచితే స్పష్టత ఉండేదన్నారు.

టాప్‌ స్కోర్‌ ఏదైతే అదే లెక్కలోకి..
2019–20 విద్యా సంవత్సరం నుంచి ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ఏటా రెండుసార్లు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి దశ పరీక్షలను ఈనెల్లో నిర్వహించింది. రెండో దశ పరీక్షలను ఏప్రిల్‌ 6 నుంచి 20వ తేదీ మధ్యలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా వచ్చే రెండో దఫా జేఈఈ మెయిన్‌ కోసం ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మార్చి 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని ఎన్‌టీఏ ప్రకటిం చింది. ఆ పరీక్షల ఫలితాలను వెల్లడించాక ఈ రెండు పరీక్షల్లో టాప్‌ స్కోర్‌ ఏదైదే దాన్నే పరి గణనలోకి తీసుకొని ప్రవేశాల కోసం ర్యాంకు లను ప్రకటిస్తామని వివరించింది. ఏప్రిల్‌లో జరిగే రెండో దశ జేఈఈ మెయిన్‌ ఫలితాల వెల్లడి తర్వాత టాప్‌ 2.56 లక్షల మందిని ఐఐ టీల్లో ప్రవేశాలకు అవసరమైన జేఈఈ అడ్వా న్స్‌డ్‌ రాసేందుకు అర్హులుగా ప్రకటించనుంది.

అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్‌ 88 పర్సెంటైల్‌!
ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే కటాఫ్‌ జనరల్‌ కేటగిరీలో 88 పర్సెంటైల్‌ ఉండే అవకాశం ఉందని నిఫుణులు పేర్కొంటున్నారు. ఓబీసీ కేటగిరీలో 70 పర్సెంటైల్, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీలో 60 పర్సెంటైల్‌ ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

విద్యార్థుల అభిప్రాయాలు..
సైంటిస్ట్‌ కావాలన్నదే లక్ష్యం: సాయికిరణ్‌
న్యూక్లియర్‌ సైంటిస్ట్‌ కావాలన్నదే నాలక్ష్యం. న్యూక్లియర్‌ పవర్‌పై పరిశోధన చేస్తా. అందుకోసం ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నా. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఐఐటీ బాంబేలో చదువాలని ఉంది. అందుకు ప్రిపేర్‌ అవుతున్నాను. మాది సిద్ధిపేట జిల్లా గౌరారం మండలంలోని పాములపర్తి గ్రామం.

సొంతంగా కంపెనీ స్థాపిస్తా: బొజ్జా చేతన్‌రెడ్డి
బాగా చదువుకొని సొంతంగా కంపెనీ స్థాపించాలన్నదే నా లక్ష్యం. అందుకు అవసరమైన పెట్టుబడి కోసం ముందుగా ఉద్యోగం చేస్తా. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతాను. అందుకోసమే ప్రిపేర్‌ అవుతున్నాను.

100 పర్సెంటైల్‌ వచ్చినవారు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top