హాస్య నటుడు వేణు మాధవ్‌కు తీవ్ర అనారోగ్యం

Telugu Comedian Actor Venu Madhav Health Condition Serious - Sakshi

వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్న వైద్యులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్‌ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పిటల్‌ వైద్యులు తెలిపారు.

హాస్యపాత్రలతో తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన వేణు మాధవ్‌ అనారోగ్యంపై చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తనకు ఎటువంటి అనారోగ్యం లేదని గతంలో ఆయన వివరణయిచ్చారు. రాజకీయాల్లో రాణించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అప్పట్లో నామినేషన్‌ కూడా వేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top