'తలసాని, తీగల రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి' | telangana tdp blames talasani srinivas yadav | Sakshi
Sakshi News home page

'తలసాని, తీగల రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి'

Oct 30 2014 4:23 PM | Updated on Aug 15 2018 9:22 PM

టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిలపై తెలంగాణ రాష్ట్ర టీడీపీ మండిపడింది.

ఢిల్లీ:టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిలపై తెలంగాణ రాష్ట్ర టీడీపీ మండిపడింది.  వారు పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే వారి సత్తా ఏమిటో తెలుస్తుందని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, చండ్ర వెంకట వీరయ్యలు విమర్శించారు.  సొంత లాభం ఆశించే ఆ ఎమ్మెల్యేలు పార్టీలు మార్చారన్నారు.  టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారు రాజీనామా చేసి మళ్లీ పోటీకి దిగితే  వారి సత్తా నిరూపితం అవుతుందన్నారు.

 

గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి(మహేశ్వరం), తలసాని శ్రీనివాస్ యాదవ్(సనత్‌నగర్)లు పార్టీ ఫిరాయింపుతో తెలంగాణ టీడీపీలో కలకలం మొదలైంది.

Advertisement
 
Advertisement
Advertisement