తెలంగాణ దేవత సోనియా | Telangana state formation day celebrations | Sakshi
Sakshi News home page

తెలంగాణ దేవత సోనియా

Jun 2 2014 3:35 AM | Updated on Mar 18 2019 7:55 PM

తెలంగాణ దేవత సోనియా - Sakshi

తెలంగాణ దేవత సోనియా

సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి ఆమె తెలంగాణ ప్రజలకు దేవతగా మారారని పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ అన్నారు.

గోదావరిఖని, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి ఆమె తెలంగాణ ప్రజలకు దేవతగా మారారని పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ అన్నారు. తెలంగాణ సంబరా ల్లో భాగంగా ఆదివారం రాత్రి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందన్నారు.
 
 కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ సాధించిన విషయాన్ని ప్రజలందరికీ చేరవేసేలా ప్రచారం చేయాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని జి.వెంకటస్వామి పోరాటం చేశారని, ఇప్పుడు ఆయన కల నెరవేరిందన్నారు.  టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నిం టిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, బాబర్ సలీంపాషా, బడికెల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, తానిపర్తి గోపాల్‌రావు, ఎం.రవికుమార్, మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, కొలిపాక సుజాత, దొంతుల లింగం, కోట రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement