తెలంగాణ సైనికుడి వీరమరణం | Telangana Soldier Saligam Srinivas Deceased In Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

తెలంగాణ సైనికుడి వీరమరణం

Jul 7 2020 7:56 AM | Updated on Jul 7 2020 8:00 AM

Telangana Soldier Saligam Srinivas Deceased In Jammu And Kashmir - Sakshi

రామగిరి(మంథని): జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున పాకిస్తాన్‌ ఉగ్రవాదుల దాడిలో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన సైనికుడు శాలిగాం శ్రీనివాస్‌(28) వీరమరణం పొందాడు. శ్రీనివాస్‌ ఏడేళ్ల క్రితం సైన్యంలో చేరాడు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాడు. రెండేళ్ల క్రితం పెళ్లయింది. కరోనా వ్యాప్తికి ముందు స్వగ్రామానికి వచ్చాడు. జూన్‌ 4న తిరిగి విధులకు వెళ్లాడు. ఇక్కడి నుంచి వెళ్లాక 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్నాడు. అనంతరం విధుల్లో చేరాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement