తెలంగాణ ఆర్టీసీకి ఇంధన పొదుపు పురస్కారం | telangana RTC award in fuel consumption | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆర్టీసీకి ఇంధన పొదుపు పురస్కారం

Mar 17 2017 4:05 AM | Updated on Sep 5 2017 6:16 AM

తెలంగాణ ఆర్టీసీకి ఇంధన పొదుపు పురస్కారం

తెలంగాణ ఆర్టీసీకి ఇంధన పొదుపు పురస్కారం

ఇంధన పొదుపులో తనకు తిరుగులేదని మరోసారి తెలంగాణ ఆర్టీసీ నిరూపించింది.

ఢిల్లీలో అవార్డు అందుకున్న ఎండీ రమణరావు
సాక్షి, హైదరాబాద్‌: ఇంధన పొదుపులో తనకు తిరుగులేదని మరోసారి తెలంగాణ ఆర్టీసీ నిరూపించింది. 4 వేల నుంచి 10 వేల బస్సులున్న రవాణా సంస్థల కేటగిరీలో రాష్ట్ర ఆర్టీసీ ఉత్తమ ఇంధన పొదుపు రవాణా సంస్థగా నిలిచింది. ఢిల్లీలోని కన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో జరిగిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్టీయూ) 61వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ అవార్డును సంస్థ ఎండీ రమణరావు అందుకున్నారు.

ఏఎస్‌ఆర్టీయూ అధ్యక్షుడు సంజయ్‌మిత్ర ఈ అవార్డును అందజేశారు. 2015–16 సంవత్సరానికి 5.5 కేఎంపీఎల్‌ సాధించినందుకు ఈ అవార్డును పొందింది. మెరుగైన కేఎంపీఎల్‌ ద్వారా 9.4 లక్షల లీటర్ల ఇంధనాన్ని, తద్వారా రూ.6.05 కోట్లు ఆదా చేసినట్లు రమణరావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement