చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు వీరికే..!

Telangana PACS Election DCCB Chairman LIst - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సహకార ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. పూర్వపు ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులకు నేడు ఎన్నికలు జరగుతున్నాయి. సంఖ్యా బలం పరంగా టీఆర్‌ఎస్‌కు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్‌ల్లో స్పష్టమైన బలం ఉండటంతో చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.

శనివారం ఉదయం 9 గంటల నుంచి చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు ప్రారంభయ్యాయి. మధ్యాహ్నం 2 గం. వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ జరిగిన తర్వాత ఒక్కో పదవికి ఒకటి కంటే ఎక్కువ నా మినేషన్లు వస్తే సాయంత్రం 5 గం. వరకు పోలింగ్‌ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేతుల మీదుగా సీల్డ్‌ కవర్లు అందుకున్న టీఆర్‌ఎస్‌ సహకార ఎన్నికల పరిశీలకులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు వరించిన వారి పేర్లను వెల్లడించారు.నల్గొండలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబరాలు


కరీంనగర్‌ డీసీసీబీ చైర్మన్‌గా నామినేషన్ వేస్తున్న  కొండూరు రవీందర్‌రావు 

జిల్లాల వారీగా.. సహకార పదవులు పొందినవారు..

  • కరీంనగర్‌ డీసీసీబీ చైర్మన్‌గా కొండూరు రవీందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా పింగళి రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. డీసీఎంఎస్‌ చైర్మన్ గా ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఫకృద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారులు.
  • ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కూరాకుల నాగభూషయ్య, వైస్ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు. డీసీఎంఎస్ చైర్మన్‌గా రాయల శేషగిరిరావు, వైస్ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాస రావు.
  • మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నిజాం పాషా, వైస్ చైర్మన్‌గా కొరమోని వెంకటయ్య, డీసీఎంఎస్ చైర్మన్‌గా ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా హర్యా నాయక్.
  • మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా పట్నం మాణిక్యం, డీసీఎంఎస్ చైర్మన్‌గా  మల్కాపూర్  శివకుమార్.
  • నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా వట్టి జానయ్య యాదవ్, వైస్‌ చైర్మన్‌గా దుర్గంపూడి నారాయణరెడ్డి.
  • ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నామ్దేవ్ కంబ్లే, వైస్‌ చైర్మన్‌గా రఘునందన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా టి లింగయ్య, వైస్‌ చైర్మన్‌గా కొమరం మాత్తయ్య.
  • నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా నల్లవెల్లి మోహన్, వైస్‌ చైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి
  • రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కొత్త మనోహర్ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా సత్తయ్య, డీసీఎంఎస్ చైర్మన్‌గా కృష్ణా రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా మదుకర్ రెడ్డి.

దాదాపు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకుని సత్తాచాటిన టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు భారీగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచారు.

ఎన్నికపై అసంతృప్తి..
నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా నల్లవెల్లి మోహన్, వైస్‌ చైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి ఎన్నికయ్యారు. అయితే, చైర్మన్‌ పదవులు ఆశిస్తున్న ఇద్దరు టీఆర్‌ఎస్‌ నేతలు, పీఏసీఎస్‌ డైరెక్టర్లు గిర్దావర్‌ గంగారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ ఈ ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమంలో ముందు నుంచి పనిచేసిన వారికి ప్రాధాన్యం లేదని వాపోయారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top