breaking news
PACS centers
-
తెలంగాణలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు
-
చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు వీరికే..!
సాక్షి, హైదరాబాద్: సహకార ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. పూర్వపు ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు నేడు ఎన్నికలు జరగుతున్నాయి. సంఖ్యా బలం పరంగా టీఆర్ఎస్కు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్‌ల్లో స్పష్టమైన బలం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు ప్రారంభయ్యాయి. మధ్యాహ్నం 2 గం. వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ జరిగిన తర్వాత ఒక్కో పదవికి ఒకటి కంటే ఎక్కువ నా మినేషన్లు వస్తే సాయంత్రం 5 గం. వరకు పోలింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా సీల్డ్ కవర్లు అందుకున్న టీఆర్ఎస్ సహకార ఎన్నికల పరిశీలకులు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు వరించిన వారి పేర్లను వెల్లడించారు. నల్గొండలో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా నామినేషన్ వేస్తున్న కొండూరు రవీందర్రావు జిల్లాల వారీగా.. సహకార పదవులు పొందినవారు.. కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా కొండూరు రవీందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా పింగళి రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ గా ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఫకృద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కూరాకుల నాగభూషయ్య, వైస్ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు. డీసీఎంఎస్ చైర్మన్‌గా రాయల శేషగిరిరావు, వైస్ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాస రావు. మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నిజాం పాషా, వైస్ చైర్మన్‌గా కొరమోని వెంకటయ్య, డీసీఎంఎస్ చైర్మన్‌గా ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా హర్యా నాయక్. మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా పట్నం మాణిక్యం, డీసీఎంఎస్ చైర్మన్‌గా మల్కాపూర్ శివకుమార్. నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా వట్టి జానయ్య యాదవ్, వైస్ చైర్మన్‌గా దుర్గంపూడి నారాయణరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నామ్‌దేవ్ కంబ్లే, వైస్ చైర్మన్‌గా రఘునందన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా టి లింగయ్య, వైస్ చైర్మన్‌గా కొమరం మాత్తయ్య. నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా నల్లవెల్లి మోహన్, వైస్ చైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కొత్త మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా సత్తయ్య, డీసీఎంఎస్ చైర్మన్‌గా కృష్ణా రెడ్డి, వైస్ చైర్మన్‌గా మదుకర్ రెడ్డి. దాదాపు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుని సత్తాచాటిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచారు. ఎన్నికపై అసంతృప్తి.. నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా నల్లవెల్లి మోహన్, వైస్ చైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి ఎన్నికయ్యారు. అయితే, చైర్మన్ పదవులు ఆశిస్తున్న ఇద్దరు టీఆర్ఎస్ నేతలు, పీఏసీఎస్ డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఈ ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమంలో ముందు నుంచి పనిచేసిన వారికి ప్రాధాన్యం లేదని వాపోయారు. -
కొనుగోళ్లు... సవాళ్లు
- ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో సమస్యలు అనేకం - మౌలిక వసతులలేమితో సతమతం - సంఘాల మీద భారం మోపేందుకు చర్యలు నీలగిరి: ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ఎదురయ్యే సమస్యలు పెనుసవాళ్లనే విసురుతున్నాయి. ప్రభుత్వం మిల్లర్ల లెవీ శాతం తగ్గించడంతో ఆ భారం మొత్తాన్ని కూడా ఇందిరా క్రాంతి పథం, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు మోయాల్సి వస్తోంది. ఈ సీజన్ నుంచే ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యంలో అధిక భాగం ఐకేపీ, పీఏసీఎస్‌లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే అందుకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలకు అన్ని వైపుల నుంచి తోడ్పాటు లభిస్తే తప్ప ధాన్యం కొనుగోలు చేసేందుకు సంఘాలు ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రెండేళ్ల నుంచి సివిల్ సప్లై, ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోళ్లు బంద్ చేయడంతో ఆ భారం మొత్తాన్ని కూడా ఐకేపీ, పీఏసీఎస్‌లు భరించాల్సి వస్తోంది. కష్టనష్టాల కోర్చి ధాన్యం కొనుగోలు చేస్తున్న సంఘాలకు మాత్రం కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు రెట్టింపు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కాబట్టి ఖరీఫ్ ధాన్యం మార్కెట్లోకి రాకముందే కనీస మౌలిక వసతులు సమకూర్చాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కమీషన్లో కోత విధించే యత్నం... ధాన్యం కొనుగోళ్లకు అసరమయ్యే గన్నీ బ్యాగులను జిల్లా పౌరసరఫరాలసంస్థ సరఫరా చేస్తుంది. టార్పాలిన్లు, తేమ యంత్రాలు, పోకర్లు, చిన్న త్రాసులు వంటివన్నీ కూడా మహిళా సంఘాలే కొంటున్నాయి. ధాన్యం కమీషన్ నుంచి కొంత మొత్తాన్ని మౌలిక వసతులకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇవిగాక గన్నీ బ్యాగుల విషయంలో పౌరసరఫరాల సంస్థ లేనిపోని పేచీలు పెట్టి కమీషన్ల్లోంచి కోత పెడుతోంది. ధాన్యం తరలించే వాహనాలకు వెయిటింగ్ చార్జీలు, డ్రైవర్లకు బోజనాలు తదితర ఖర్చులన్నీ కూడా మహిళా సంఘాలు భరిస్తున్నాయి. ఇదిగాక మిల్లర్లు ఇచ్చే ట్రక్‌షీట్లలో ధాన్యం తేడా ఉందన్న కారణంతో మరింత కోత విధిస్తున్నారు. ఈ ఖర్చులన్నీ మినహాయిస్తే సంఘాలకు వచ్చే కమీషన్ నామమాత్రం. సంఘాలకు తప్పని భారం.. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే సామగ్రి అంతా కూడా సంఘాలు కమీషన్ నుంచే కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. కానీ రైస్‌మిల్లుల లెవీ శాతం తగ్గింది కాబట్టి ధాన్యం కొనుగోలు చేయాల్సిన పూర్తి బాధ్యత సంఘాల మీద పడింది. కావున మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలనేది సంఘాల వాదన. ఈ సీజన్లో ఐకేపీ 80 కేంద్రాలు, పీఏసీఎస్‌లు 43 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. అందుకోసం ధాన్యం ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, తేమ యంత్రాలు, పోకర్లు, ఇతర అవసరాలను తెలియజేస్తూ ఓ నివేదిక రూపొందించారు. కొనుగోళ్లు ప్రారంభంకాక ముందే వీటిన్నింటిని సమకూరిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు. లేకుంటే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.