టీవీ కార్యక్రమాలపై ఈ మధ్య కాలంలో ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి.
హైదరాబాద్: టీవీ కార్యక్రమాలపై ఈ మధ్య కాలంలో ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్‌లో ప్రసారమైన కార్యక్రమంలో తమను తీవ్రంగా అవమానించారంటూ నర్సులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓ టీవీ ఛానెల్‌లో ఈ నెల 4వ తేదీన ప్రసారమైన పటాస్‌షోలో నర్సులను కించపరిచేలా అసభ్యంగా మాట్లాడారని తెలంగాణ నర్స్ అసోయేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో జబర్దస్థ్ కార్యక్రమంలో తమను కించపరిచారంటూ న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విశయం తెలిసిందే