ప్రతిపక్షాలకు చేతిలో పనిలేకుండా పోయింది | Telangana Minister KTR Visits Ramayampet in Medak | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలకు చేతిలో పనిలేకుండా పోయింది

Jun 19 2015 5:25 PM | Updated on Oct 16 2018 3:12 PM

ప్రతిపక్షాలకు చేతిలో పనిలేకుండా పోయింది - Sakshi

ప్రతిపక్షాలకు చేతిలో పనిలేకుండా పోయింది

వివిధ సంక్షేమ పధకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు.

రామాయంపేట (మెదక్) : వివిధ సంక్షేమ పధకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో కలసి రామాయంపేటలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాలకు చేతిలో పనిలేకుండా పోయిందని మంత్రి ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement