కేటీఆర్ దుబాయ్ పర్యటన రద్దు | Telangana IT Minister KTR Dubai tour cancelled | Sakshi
Sakshi News home page

కేటీఆర్ దుబాయ్ పర్యటన రద్దు

Dec 13 2014 8:55 AM | Updated on Sep 2 2017 6:07 PM

కేటీఆర్ దుబాయ్ పర్యటన రద్దు

కేటీఆర్ దుబాయ్ పర్యటన రద్దు

తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే.తారకరామారావు తన దుబాయ పర్యటనను రద్దు చేసుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే.తారకరామారావు తన దుబాయ పర్యటనను రద్దు చేసుకున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్తో తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ భేటీ కానున్నారు. హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఏర్పాటుపై రవిశంకర్ ప్రసాద్తో కేసీఆర్, కేటీఆర్ చర్చించనున్నారు.

గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న తెలంగాణ వాసులను స్వస్థలాలకు రప్పించేందుకు ... అలాగే నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానం కోసం దుబాయ్ పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ బృందం సమావేశం కావాల్సి ఉంది. కేటీఆర్ దుబాయ్ పర్యటన మళ్లీ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నామని ఆయన కార్యాలయం వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement