తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల | Telangana ICET Results Declared | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల

Jun 13 2018 1:25 PM | Updated on Jun 13 2018 1:29 PM

Telangana ICET Results Declared - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐసెట్ 2018 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ ఐసెట్‌లో 90.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. 55,191 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్ష రాయగా, 49,812 మంది అర్హత పొందారు.

15 రోజుల్లో ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.  ఐసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు చైర్మన్ పాపిరెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం గత నెల 23, 24 న ఐసెట్‌ను నిర్వహించారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

Advertisement
 
Advertisement
Advertisement