మార్చి 19 నుంచి టెన్త్‌ పరీక్షలు

Telangana Government Released 10th Exam Time Table - Sakshi

టైం టేబుల్‌ జారీ చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం

సాక్షి, హైదరాబాద్‌ : పదో తరగతి వార్షిక పరీక్షల టైం టేబుల్‌ విడుదలైంది. 2020, మార్చి 19వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం టైం టేబుల్‌ ఖరారుచేసి ప్రకటించిం ది. ఎస్‌ఎస్‌సీ రెగ్యులర్, ప్రైవేటు, ఒకేషనల్, ఓఎస్‌ఎస్‌సీ విద్యార్థులకు ఈ టైం టేబుల్‌ వర్తిస్తుందని తెలిపింది. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12:15 గంట ల వరకు కొనసాగుతాయని పే ర్కొంది. ద్వితీయ భాష పరీక్ష, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1, పేపరు–2 పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంట ల వరకు ఉంటాయని వెల్లడించిం ది. అలాగే కాంపోజిట్‌ కోర్సు ప్ర థమ భాష పేపర్‌–2 పరీక్ష 10:45 గంటల వరకు, ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు పరీక్ష 11:30 గంటల వరకు కొనసాగుతాయని వివరించింది. విద్యార్థులకు పరీక్షలో ఆఖరి అరగంట ముందు ఆబ్జెక్టివ్‌ పేపర్‌ను ఇస్తారని చెప్పింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top