నేడు తెలంగాణ ఎంసెట్ ర్యాంకులు | Telangana Eamcet ranks to be released today | Sakshi
Sakshi News home page

నేడు తెలంగాణ ఎంసెట్ ర్యాంకులు

May 28 2015 1:38 AM | Updated on Sep 3 2017 2:47 AM

తెలంగాణ ఎంసెట్ ర్యాంకులను గురువారం విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొ. ఎన్‌వీ రమణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

* విడుదల చేయనున్న కడియం శ్రీహరి
* ఇంటర్ వార్షిక పరీక్షల మార్కుల వెయిటేజీతో ర్యాంకులు

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ర్యాంకులను గురువారం విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొ. ఎన్‌వీ రమణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ర్యాంకులను హైదరాబాద్ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారని వెల్లడించారు. విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కలిపి ఈ ర్యాంకులను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
 
 ఇందులో విద్యార్థుల ర్యాంకులతోపాటు ఎంసెట్‌లో సాధించిన మార్కులను కూడా ఇవ్వనున్నట్లు వివరించారు. ఇంజనీరింగ్ కూ 1,28,174 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌కు 84,678 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం ఇంటర్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ఇస్తుండగా, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వేరుగా ర్యాంకులను ఇస్తారు.
 
 ఫలితాల కోసం
 www.sakshieducation.com
 www.tseamcet.in
 www.results.cgg.gov.in

Advertisement
 
Advertisement
Advertisement