తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లోని ఆర్టీసీ బస్ స్టేషన్లను ఆధునీకరించనున్నట్టు రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు.
తాండూరు: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లోని ఆర్టీసీ బస్ స్టేషన్లను ఆధునీకరించనున్నట్టు రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తాండూరు బస్టాండ్ ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభించారు. తాండూరు నుంచి గానుగాపూర్ నూతన బస్సు సర్వీసు ప్రారంభించారు. 10 జిల్లాల్లోని 95 డిపోల పరిధిలో ఉన్న బస్టాండ్లను రూ.23 కోట్ల నిధులతో ఆధునీకరించనున్నట్టు మహేందర్‌రెడ్డి చెప్పారు.