mahenderreddy
-
తెలంగాణ అప్రమత్తం!
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్లో అధికరణ 370, అధికరణ 35ఏ రద్దు పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర హోం శాఖ, నిఘా వర్గాల సమాచారం మేరకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడా ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవాలు, సభలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం అందుకు తమ అనుమతి తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల అనుమతి లేకుండా ర్యాలీలు తీసేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధికరణ 370 రద్దు ప్రకటనకు ముందే అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసుల ను కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. ప్రకటన అనంతరం కేంద్ర హోం శాఖ వర్గాలు అధికారికంగా తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేశాయి. ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ కాన్ఫరెన్స్.. కేంద్రం ఆదేశాలతో అప్రమత్తమైన డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల విషయంలో తగిన సూచనలు చేశారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. సైబర్, టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీ, టీఎస్ఎస్పీ పోలీసులతోనూ డీజీపీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్లు, ఎస్పీలతో పాటు, కొన్ని ప్రాంతాల్లో ఇన్స్పెక్టర్లకు కూడా పలు సూచనలు చేశారు. ఉద్రిక్తతలు తొలగి సాధారణ వాతావరణం వచ్చేంత వరకు ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా సున్నితప్రాంతాలు అధికంగా ఉండే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కొన్ని సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు. -
అజ్ఞాతంలో 135 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన 135 మంది, ఏపీకి చెందిన 80 మంది మావోయిస్టు పార్టీలో ఉన్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఇతర కేడర్‌లో పనిచేస్తున్న వారంతా జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. సోమవారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న లొంగుబాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. జంపన్నపై దేశవ్యాప్తంగా 100కుపైగా కేసులున్నాయని, అందులో తెలంగాణలో 51 కేసులున్నాయని చెప్పారు. జంపన్న ఆధ్వర్యంలో 1991 ఫిబ్రవరి 22న వాజేడు పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి 14 ఆయుధాలు అపహరించిన ఘటనలో కొందరు పోలీస్ కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. 1991 జూన్ 15న ఏటూరు నాగారం పరిధిలోని చెల్పాకాలో పోలీస్ జీపును పేల్చేశారని, ఆ ఘటనలో సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై కిషోర్‌కుమార్, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారని చెప్పారు. భద్రాద్రి కొత్త గూడెం పరిధిలోని కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి 17 మంది పోలీసులను హతమార్చారని, ఆయుధాలను ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. ఇక మావోయిస్టు పార్టీలో 13 ఏళ్లుగా పనిచేస్తున్న అనిత అలియాస్ రజిత భర్త జంపన్నతో కలసి లొంగిపోయినట్టు డీజీపీ వెల్లడించారు. జంపన్నపై ఉన్న రూ.25 లక్షలు, రజితపై ఉన్న రూ.5 లక్షల రివార్డును ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామన్నారు. అజ్ఞాతంలోనే వివాహం.. జంపన్న భార్య హింగె అనిత అలియాస్ రజిత స్వస్థలం వరంగల్ జిల్లా దామెర. ఆమె హన్మకొండలోని ఆదర్శ కాలేజీలో ఇంటర్, వడ్డెపల్లిలోని డిగ్రీ కాలేజీలో బీఎస్సీ, ఉస్మానియా దూరవిద్యా కేంద్రం ద్వారా ఎమ్మెస్సీ చేశారు. 2004లో చిట్యాల లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ కమాండర్ రమాకాంత్ పరిచయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. జంపన్న నేతృత్వంలో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీలోని ప్రెస్ టీమ్‌లో పనిచేశారు. 2006లో సెంట్రల్ రీజియన్ బ్యూరో ప్రెస్ టీమ్‌కు.. 2007లో ఏరియా కమిటీ సభ్యురాలిగా నియమి తులయ్యారు. 2009లో పార్టీ అనుమతి పొంది జంపన్న, రజిత వివాహం చేసుకున్నారు. 2012లో రజితను ఒడిశా రాష్ట్ర కమిటీకి బదిలీ చేశారు. 2014లో డివిజనల్ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ వరకు.. జంపన్న అలియాస్ జినుగు నర్సింహారెడ్డి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చర్లపాలెం. 1979–80లో హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐలో చదువుతుండగా పీపుల్స్‌వార్‌కు చెందిన శాఖమూరి అప్పారావు, పులి అంజయ్య అలియాస్ సాగర్ల స్ఫూర్తితో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1984లో పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా చేరి.. ఏడాదిలోనే ఏటూరు నాగారం దళానికి కమాండర్‌గా నియమితులయ్యారు. 1991లో ఉత్తర తెలంగాణ ఫారెస్ట్ డివిజన్ (ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్)లో సభ్యుడిగా నియమించారు. ఏడాది తిరిగేలోగా అదే కమిటీకి కార్యదర్శిగా ఎదిగారు. పార్టీ కేంద్ర నాయకత్వం 2000 సంవత్సరంలో జంపన్నకు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. 2003లో ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌లో జరిగిన 9వ ప్లీనరీలో స్పెషల్ జోనల్ కమిటీ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. భారీ స్థాయిలో మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించిన నేపథ్యంలో. జంపన్నను కేంద్ర మిలటరీ కమిషన్ సభ్యుడిగా నియమించారు. 2004లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. అనంతరం సెంట్రల్ రీజియన్ బ్యూరో సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్చార్జిగా, ఛత్తీస్‌గఢ్–ఆంధ్రా కమిటీ లీడ్ మెంబర్‌గా కొనసాగారు. కేంద్ర కమిటీలో 18 మంది మావోయిస్టు పార్టీలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కేంద్ర కమిటీలో ఇప్పటివరకు 19 మంది సభ్యులుండగా.. జంపన్న లొంగుబాటుతో వారి సంఖ్య 18కి తగ్గింది. వయోభారం, అనారోగ్య కారణాలు, సైద్ధాంతిక విభేదాలు, వ్యక్తిగత కారణాలతో నేతలు లొంగిపోతుండటం.. కాలక్రమేణా మావోయిస్టు పార్టీని తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యులుగా ప్రశాంత్ బోస్, నంబాల కేశవరావు, మిసర్ బెస్రా, మల్లోజుల వేణుగోపాల్‌రావు, కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, తిప్పిరి తిరుపతి, దేవ్‌కుమార్‌సింగ్, అక్కిరాజు హరగోపాల్, కడారి సత్యనారాయణరెడ్డి, వివేచ్ చందర్‌యాదవ్, రంజిత్ బోస్, మోడెం బాలకృష్ణ, పుల్లూరి ప్రసాద్‌రావు, రావుల శ్రీనివాస్, ఒగ్గు బురల్సత్యాజీ, మిలింద్ తేల్ముండే ఉన్నారు. -
సైద్ధాంతికంగా విభేదించి లొంగిపోయారు
-
నలుగురు ఐపీఎస్‌లకు పదోన్నతి
హైదరాబాద్ : రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నోతి లభించింది. రాష్ట్రంలోని మహేందర్ రెడ్డి, రాజీవ్ త్రివేది, టి. కృష్ణ ప్రసాద్, అలోక్ ప్రభాకర్లకు పదోన్నతి కల్పించింది. -
అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలి
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి జగిత్యాల జోన్ :హెల్త్‌కార్డుల ద్వారా ఉపాధ్యాయులకు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జాలి మహేందర్‌రెడ్డి కోరారు. జగిత్యాల పట్టణంలో యూనియన్ సమావేశం అదివారం జరిగింది. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై నేల రోజులు దాటినా చాల పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు రాలేదని తెలిపారు. ఉపా«ధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎన్నం నర్సింహారెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు యాళ్ల అమర్నాథ్రెడ్డి, సత్యనారాయణ, శ్రీకాంత్‌రావు, రాజేశ్, ఏవీఎన్.రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
'23 కోట్లతో బస్ స్టేషన్ల ఆధునీకరణ'
తాండూరు: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లోని ఆర్టీసీ బస్ స్టేషన్లను ఆధునీకరించనున్నట్టు రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తాండూరు బస్టాండ్ ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభించారు. తాండూరు నుంచి గానుగాపూర్ నూతన బస్సు సర్వీసు ప్రారంభించారు. 10 జిల్లాల్లోని 95 డిపోల పరిధిలో ఉన్న బస్టాండ్లను రూ.23 కోట్ల నిధులతో ఆధునీకరించనున్నట్టు మహేందర్‌రెడ్డి చెప్పారు. -
'సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం'
సైదాబాద్: నిఘా నేత్రాలతోనే సేఫ్ సిటీ సాధ్యమని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం అన్నారు. సైదాబాద్ డివిజన్ తిరుమల హిల్స్‌లో సేఫ్ కాలనీలో భాగంగా ఏర్పాటు చేసిన 34 సీసీ కెమెరాలు, ప్రధాన గేట్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాలనీ సంక్షేమ సంఘాల సహకారంతో, సేఫ్ కాలనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పటిష్ట శాంతి భద్రతలకు అక్కడి పోలీస్ వ్యవస్థే కారణమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 24 అంతస్తులతో నిర్మించనున్న భవనంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, న గరంలోని మొత్తం సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థను రూపొందిస్తామని పేర్కొన్నారు. మలక్‌పేట ఎమ్మెల్యే బలాల మాట్లాడుతూ..సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు.