ప్రాక్టికల్గా తెలంగాణ బడ్జెట్: ఈటెల | Sakshi
Sakshi News home page

ప్రాక్టికల్గా తెలంగాణ బడ్జెట్: ఈటెల

Published Thu, Feb 12 2015 10:57 AM

ప్రాక్టికల్గా తెలంగాణ బడ్జెట్: ఈటెల - Sakshi

హైదరాబాద్ : తాము ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్ ప్రయోగాత్మకంగా ఉంటుందని ఆర్థిక మంత్రి  ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన గురువారం 'సాక్షి'తో మాట్లాడుతూ.. రాష్ట్ర రాబడి, వ్యయంపై స్పష్టత వచ్చిందన్నారు. బడ్జెట్లో సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమల ద్వారా ఉపాధికి పెద్దపీఠ వేశామన్నారు. ఇకపై కేంద్రం నిధులు పెరగడంతో పాటు నేరుగా రాష్ట్రాలకు అందుతాయన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి అన్న ప్రాధాన్యాన్ని కేంద్రం గుర్తించిందని ఈటెల అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా బడ్జెట్‌కు  రూపకల్పన చేస్తామన్నారు. తొలి ఆర్నెల్ల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముందుగానే ఉమ్మడి సభలో ఆమోదించినందున అక్టోబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు అవసరమైన పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆర్థిక శాఖ రూపకల్పన చేస్తుందని తెలిపారు. కాగా  తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలను మార్చి 6వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే నెల10 లేదా 11వ తేదీల్లో 2015-16 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement
Advertisement