అరెస్ట్‌లను ఖండించిన మురళీధర్‌ రావు

Telangana BJP Chief K Lakshman Arrested And Sent To nims Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్వాకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌.. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేసి నిమ్స్‌కు తరలించారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ నాయకులను అరెస్ట్‌ చేయడం పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఇంటర్‌ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా లక్ష్మణ్‌ దీక్ష చేపట్టారని తెలిపారు. శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తున్న లక్ష్మణ్‌ని అరెస్ట్‌ చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరసన చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రగతి భవన్‌ ముట్టడితో సహా రేపటి అన్ని కార్యక్రమాలు యధాతథంగా కొనసాగుతాయని మురళీధర్‌ రావు స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top