యువతి అదృశ్యం | Teenager missing | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

Mar 3 2016 7:45 PM | Updated on Apr 7 2019 4:36 PM

గుడికి వెళ్లి యువతి అదృశ్యమైన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

నేరేడ్‌మెట్ (హైదరాబాద్) : గుడికి వెళ్లి యువతి అదృశ్యమైన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎన్.చంద్రబాబు సమాచారం మేరకు... గోకుల్‌నగర్‌లో నివాసముండే ఎం.శరణప్ప పానీ పూరి వ్యాపారం చేస్తుంటాడు. ఇతని కుమార్తె ఎం.లక్ష్మి(18) బుధవారం సమీపంలోని హనుమాన్ ఆలయానికని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి శరణప్ప గురువారం నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement