‘సమ్మర్‌’ టీచర్లకు నిరాశ | Teachers Unhappy with Summer Salaries | Sakshi
Sakshi News home page

‘సమ్మర్‌’ టీచర్లకు నిరాశ

Mar 22 2018 7:22 AM | Updated on Mar 22 2018 7:22 AM

Teachers Unhappy with Summer Salaries - Sakshi

ఆత్మకూరు(పరకాల) : జిల్లాలో 678 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. గత ఏడాది వేసవి సెలవుల్లో స్కూల్‌కు ఒకరి చొప్పున ప్రభుత్వ ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన నిర్వహణ విధులకు హాజరయ్యారు. ఇందుకుగాను స్కూల్‌అసిస్టెంట్, హెచ్‌ఎం క్యాడర్‌ స్థాయి వారికి రోజుకు రూ.300, ఎస్జీటీలకు రూ.225 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది గడుస్తున్నా గౌరవ వేతనం, పీపీఎల్‌(సంపాదిత సెలవులు) జాడలేదు.

మళ్లీ ఎండాకాలం సెలవులు వస్తున్నాయి. ఇప్పటి వరకు హానరోరియం అందించకపోగా తాజాగా గౌరవ వేతనంలో భారీగా కోత పెడుతూ విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రూ.300లకు బదులు రూ.25, రూ.225కు బదులు రూ.18.75 చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తున్నారు. మొదట ప్రకటించిన విధంగా హానరోరియమ్‌తో పాటు పీపీఎల్‌ సెలవులు మంజూరుచేస్తూ తిరిగి ఉత్తర్వులను జారీచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement