
మోటారు తీయడం కోసం నీటి సంపులోకి దిగిన ఉపాధ్యాయుడు సలీం
మంచాల : పంచాయతీ కార్మికుల సమ్మెతో గ్రామ ప్రత్యేకాధికారులకు కష్టాలు వచ్చాయి. కార్మికులు చేయాల్సిన పనులు అధికారులే చేయాల్సి వస్తోంది. మంచాల గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారిగా స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.
పాడైపోయిన బోరుబావులను మరమ్మతు చేయడానికి కూలీలు కూడా ముందుకు రావడం లేదు. దీంతో నారాయణరెడ్డి తన తోటి ఉపాధ్యాయుడు సలీం, పంచాయతీ కార్యదర్శి కృష్ణ సహకారంతో సంపులో నుంచి మోటారును బయటకు తీసి మరమ్మతులు చేశారు. ఇలా అదనపు బాధ్యతలు ఉపాధ్యాయులకు భారంగా మారాయి.