నందమూరి హీరోకు జీహెచ్‌ఎంసీ షాక్‌! | Tarakaratna Kabara Restaurant Was Demolished By GHMC | Sakshi
Sakshi News home page

Feb 4 2019 1:34 PM | Updated on Feb 4 2019 1:49 PM

Tarakaratna Kabara Restaurant Was Demolished By GHMC - Sakshi

సాక్షి, హైదరాబాద్ : నందమూరి హీరో తారకరత్నకు గట్టి షాక్‌ తగిలింది. బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెం.12లో తారక రత్న నడుపుతున్న కబరా డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేసేందుకు ప్రయత్నించారు. దీంతో రెస్టారెంట్‌ నిర్వాహకులు జీహెచ్‌ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో హీరో తారక రత్న హుటాహుటిన అక్కడికికి చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారన్న కారణంతోనే అధికారులు ఈ చర్యలు చేపట్టారని తెలుస్తోంది. రాత్రి వేళల్లో మద్యం అమ్మకాలు, సౌండ్స్‌తో న్యూసెన్స్‌ చేస్తున్నారని సొసైటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement