
పెద్దమ్మతల్లికి పూజలు చేస్తున్న మంత్రి తలసాని
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని సోమవారం భద్రాచలం సీతారాముల కళ్యాణానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రాష్ట్ర సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఈఓ, «సంకటాల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ కోడిబాలశౌరి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆలయం చుట్టు ప్రదక్షణలు చేసిన అనంతరం మంత్రి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధర్మకర్తులు కొత్తవెంకట్‌రెడ్డి, పోతురాజు వెంకటేశ్వర్లు, జామ్లా, తిమ్మిరి నరేంద్రబాబు, అరుద్ర సత్యనారాయణలతో కలిసి ఈఓ, ఆలయకమిటీ చైర్మన్ మంత్రికి శేషవస్త్రప్రసాదాలను అందజేశారు.