tempel
-
మౌనిక, పాపపై దాడి జరిగినట్టు ఆధారాలు లేవు
సాక్షి, నాగర్‌కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న దాడి ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టామని నాగర్‌కర్నూల్ ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న కుమ్మెర జాతరలో దాడి జరిగిన సమయంలో డయల్ 100కు సమాచారం వచ్చిన వెంటనే స్పందించామన్నారు. ముందుగా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి తలకు గాయమైందని గణేశ్‌పై ఫిర్యాదు ఇచ్చారని, దీంతో కేసు నమోదు చేశామన్నారు. అలాగే గణేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై మరో కేసు పెట్టామని చెప్పారు. అయితే ఘటన రోజు ఇచ్చిన ఫిర్యాదులో గణేశ్, చంద్రకళపై మాత్రమే దాడి గురించి ప్రస్తావించారని, మౌనిక, పాపపై దాడి జరిగినట్టుగా ఫిర్యాదులో లేదన్నారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఈ నెల 21న ఉదయం పాప మరణించిందని చెప్పారు. జనరల్ ఆస్పత్రిలో పాపకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారని పేర్కొన్నారు. ఈ నెల 17న జాతరలో తల్లి చంద్రకళను శ్రీనివాస్‌రెడ్డి తిట్టాడని.. శ్రీనివాస్‌రెడ్డిని దూషిస్తూ గ్రామ వాట్సప్ గ్రూప్‌లో గణేశ్ ఆడియో పోస్టు చేశాడు. గ్రూప్‌లో ఎందుకు పోస్టు చేశావంటూ గణేశ్‌ను ప్రశ్నిస్తూ శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో 8 మంది గణేశ్, చంద్రకళపై దాడికి దిగినట్టు వివరించారు.8మందిపైకేసు... ముగ్గురు రిమాండ్నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో గత డిసెంబర్ 21న 1.44 కిలోల బరువుతో పాప జన్మించినట్టు ఎస్పీ చెప్పారు. శ్వాస సంబంధ సమస్యతో ఎన్ఐసీయూలో చికిత్స పొందిందన్నారు. ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో 30 రోజులపాటు చికిత్స పొందినట్టు చెప్పారు. రెస్పిరేటరీ, జాండీస్, న్యూమోనియా సమస్యలున్నట్టు గుర్తించామన్నారు. అయితే పాప మరణానికి సంబంధించి ఫోరెన్సిక్, విస్త్రా రిపోర్టు రావాల్సి ఉందని చెప్పారు. కుమ్మెర జాతరలో మౌనికతోపాటు ఆమె బిడ్డపై దాడి జరిగినట్టు ఆధారాలు కనిపించలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని, ఇప్పటికే దాడి చేసిన 8 మందిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని రిమాండ్‌కు పంపామని వివరించారు. మిగతా వారు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.బాధితుల ఆచూకీ లేదు: నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్కుమ్మెర ఘటనలో దాడికి గురైన బాధిత కుటుంబం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో ఆరు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం రాత్రి బాధిత కుటుంబ సభ్యులు దీక్షా శిబిరాన్ని ఖాళీ చేశారు. ఆ తర్వాత అక్కడి టెంట్లు, వేదికను సైతం తొలగించారు. దీనిపై నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ స్పందిస్తూ బాధిత కుటుంబం తమకు సమాచారం ఇవ్వకుండా కారులో వెళ్లిపోయారని చెప్పారు. బీసీ జేఏసీ, డీఎస్పీ నాయకులు సాయి, రఘు వారిని కారులో తీసుకువెళ్లారని చెప్పారు. కాగా, హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించేందుకు బాధిత కుటుంబం వెళ్లినట్లు సమాచారం.నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వండి: ఎన్హెచ్ఆర్సీ ఆదేశంకుమ్మెర జాతరలో దాడి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్‌ను ఆదేశించింది. ఈ ఘటనపై న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయగా కమిషన్ స్పందించింది. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి యాక్షన్ టోకెన్ రిపోర్టును తమకు నాలుగు వారాల్లో అందించాలని కలెక్టర్, ఎస్పీలకు నోటీసు జారీ చేసింది. -
అమ్మకానికి కేసీఆర్ గుడి
-
సంతాన వేణుగోపాలుడు
కృష్ణానది హంసలదీవిలో సముద్రుని ఒడిలో పదిలంగా చేరుతుంది. హంసలదీవిలో సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక కాకి ఈ ప్రాంతంలో హంసగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి ఆ హంసలదీవి అనే పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందరి పాపాలను కడిగిన గంగానది, ఆ పాప పంకిలాన్ని పోగొట్టుకోవడం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించగా, గంగాదేవిని కాకి రూపంలో సకల పుణ్యతీర్థాలలో స్నానమాచరించమన్నాడట శ్రీహరి. సకల పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూన్న కాకి... కృష్ణవేణి సాగర సంగమంలో హంసగా మారడంతో, ఈ ప్రాంతాన్ని హంసలదీవిగా పిలుస్తున్నారు. ఇక్కడ ఎందరో మునులు తపస్సు చేసుకుంటూ సంచరించేవారని, పరమహంసలు సంచరించిన ప్రదేశం కాబట్టి హంసలదీవి అన్నారని మరో ఒక కథనం ప్రచారంలో ఉంది. వేణుగోపాలస్వామి ఆలయం... ఇక్కడ వేణుగోపాలస్వామి రుక్మిణీసత్యభామా సమేతుడై కొలువుతీరాడు. ఈ ఆలయంలో శ్రీవేణుగోపాలస్వామి పిలచినదే తడవుగా పలుకుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఇది ఒక పవిత్ర పుణ్యస్థలం. ఈ దేవాలయాన్ని పూర్వం దేవతలే ఒక్కరాత్రిలో స్వయంగా నిర్మించారని స్థానికుల విశ్వాసం. దేవాలయ నిర్మాణం పూర్తయి, గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారిపోవడంతో, దేవతలు వెళ్లిపోయారనీ అందువల్ల అది అసంపూర్తిగా మిగిలి పోయిందనీ అక్కడి ప్రజలు చెబుతారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు దానిని ఐదంతస్తుల గాలిగోపురంగా నిర్మించారు. ఇక్కడ స్వామి విగ్రహం నీలిమేఘచ్ఛాయలో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. ఈ ఆలయంలో వివాహం చేసుకుని, సాగరసంగమ ప్రదేశంలో నూతన దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే నూరేళ్లు సుఖంగా జీవిస్తారని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా ఈ ఆలయంలో నిద్రచేస్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం కలుగుతుందని కూడా నమ్ముతారు. – డా. వైజయంతి -
పెద్దమ్మతల్లిని దర్శించుకున్న తలసాని
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని సోమవారం భద్రాచలం సీతారాముల కళ్యాణానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రాష్ట్ర సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఈఓ, «సంకటాల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ కోడిబాలశౌరి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆలయం చుట్టు ప్రదక్షణలు చేసిన అనంతరం మంత్రి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధర్మకర్తులు కొత్తవెంకట్రెడ్డి, పోతురాజు వెంకటేశ్వర్లు, జామ్లా, తిమ్మిరి నరేంద్రబాబు, అరుద్ర సత్యనారాయణలతో కలిసి ఈఓ, ఆలయకమిటీ చైర్మన్ మంత్రికి శేషవస్త్రప్రసాదాలను అందజేశారు. -
ముక్కంటి చెంత జర్మనీదేశస్తులు
ముక్కంటి చెంత జర్మనీదేశస్తులు శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి ఆలయానికి శనివారం జర్మనీకి చెందిన 15 వుంది భక్తులు వచ్చారు. స్వామి, అవ్మువారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. శిఖర దర్శనాలు చేసుకుని ఆలయ శిల్పసౌందర్యాన్ని కొనియాడారు. అనంతరం ఆలయ సమీపంలోని కళంకారీ సెంటర్లలో పలు వస్తువులు కొనుగోలు చేశారు.


