కేసీఆర్కు తలసాని ఆహ్వానం | Talasani Srinivas invites KCR for Palahara panduga | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు తలసాని ఆహ్వానం

Jul 14 2014 12:57 PM | Updated on Aug 15 2018 9:20 PM

కేసీఆర్కు తలసాని ఆహ్వానం - Sakshi

కేసీఆర్కు తలసాని ఆహ్వానం

ముఖ్యమంత్రి కేసీఆర్ను పలహార పండుగకు సనత్ నగర్ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానించారు.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ను పలహార పండుగకు సనత్ నగర్  టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానించారు. ఆయన సోమవారం కేసీఆర్ ను కలిసి పలహారానికి రావాల్సింది ఆహ్వానం పలికారు. కేసీఆర్ సోమవారం సాయంత్రం తలసాని నివాసానికి వెళ్లనున్నారు.

మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్...టీఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆషాడ మాసం ముగిసిన తరువాత శ్రావణ మాసం తొలి వారాన్ని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు కూడా ప్రచారం. చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా పోలవరం ప్రాజెక్ట్, హైదరాబాద్పై గవర్నర్ అధికారం తదితర అంశాలను సాకుగా చూపుతూ తలసాని టీడీపీ కి గుడ్బై చెప్పనున్నట్లు సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement